Share News

Supreme Court Review: తప్పనిసరి టెట్‌ ఆదేశాలపై జోక్యం చేసుకోవాలి

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:52 AM

ఉపాధ్యాయులు రెండేళ్లలో తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌లో ఉత్తీర్ణులు కావాలని లేదా ఉద్యోగం నుంచి రిటైర్‌ కావాలంటూ ......

Supreme Court Review: తప్పనిసరి టెట్‌ ఆదేశాలపై జోక్యం చేసుకోవాలి

  • ప్రధాని, విద్యాశాఖ మంత్రికి ఎస్టీఎ్‌ఫఐ వినతిపత్రాలు

  • రివ్యూ పిటిషన్‌ వేయాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి వినతి

హైదరాబాద్‌,సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు రెండేళ్లలో తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ఉత్తీర్ణులు కావాలని లేదా ఉద్యోగం నుంచి రిటైర్‌ కావాలంటూ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు సమీక్షించేలా రివ్యూ పిటిషన్‌ వేయాలని స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీఎ్‌ఫఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 1న ఇచ్చిన తీర్పు 23.08.2010కి ముందు దేశవ్యాప్తంగా నియామకమైన 25లక్షల మంది టీచర్లపై ప్రభావం చూపుతుందని ఎస్టీఎ్‌ఫఐ అధ్యక్షుడు సీఎన్‌ భారతి, ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి అబ్దుల్లా షఫీ తెలిపారు. వారు బుధవారం న్యూఢిల్లీలో సౌత్‌ బ్లాకులో ప్రధానమంత్రి కార్యాలయంలో, శాస్ర్తీ భవన్‌లోని విద్యా శాఖ మంత్రి, విద్యాశాఖ కార్యదర్శి కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. అలాగే, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్సీటీఈ) కార్యాలయంలో చైర్మన్‌ పంకజ్‌ అరోరా, కార్యదర్శి అభిలాష మిశ్రాలను కలిసి టెట్‌ సిలబ్‌సను మార్చాలని, ఉత్తీర్ణత మార్కులను 60ు నుంచి 50ుకి సవరించాలని వినతి పత్రాలు ఇచ్చారు. అనంతరం సుప్రీంకోర్టును సందర్శించి సీనియర్‌ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి ఎస్టీఎ్‌ఫఐ ఆధ్వర్యంలో ఈ నెలాఖరులోగా రివ్యూ పిటిషన్‌ వేయటానికి ఏర్పాట్లు చేశామని ఓ ప్రకటనలో వారు తెలిపారు. టెట్‌పై సుప్రీం కోర్టు తీర్పుతో రాష్ట్రంలోనూ అనేక మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంను కలిసినవారిలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పుల్గం దామోదర్‌ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్‌ ఉన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 04:52 AM