ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్చి
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:37 PM
టెట్ పరీక్ష నుంచి ఉపాధ్యాయులను మినహా యింపు ఇవ్వాలని ఎస్‌టీయూ రాష్ట్ర అసోసియే ట్ అధ్యక్షుడు హన్మంతురెడ్డి డిమాండ్ చేశారు.
- టెట్ పరీక్షపై ఎస్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హన్మంతు రెడ్డ్చి
అచ్చంపేటటౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : టెట్ పరీక్ష నుంచి ఉపాధ్యాయులను మినహా యింపు ఇవ్వాలని ఎస్‌టీయూ రాష్ట్ర అసోసియే ట్ అధ్యక్షుడు హన్మంతురెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావే శంలో పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల పాటు వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుల పాలిట ఆందోళ నకరంగా తయారైన టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్) పరీక్షాపై సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వుల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్వూ పిటిషన్ వేయాలన్నారు. టెట్ పరీక్షా నుంచి ఉపాధ్యా యులకు మినహాయింపు ఇప్పించాలని ఎన్సీటీ ఈ మార్గదర్శకాలకు తగిన రీతిగా సవరించు నున్నట్లు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల ని కోరారు. 2010 కంటే ముందుగా నియామ కమైన ఉపాధ్యాయులను విధిగా వినహాయిం చాలని విద్యార్థి హక్కు చట్టం సరి చేయాల న్నారు. అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల అధ్యక్ష్య, కార్యదర్శులుగా నారాయణ గౌడ్, కొండ భాస్కర్‌లు, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, సృజన, సర్వసతిలను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్‌రావు, కపిలవాయి విష్ణుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.