kumaram bheem asifabad- విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:13 PM
విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురష్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యశాఖ అద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్, ఇన్‌ఛార్జీ డీఈఓ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి హజరై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురష్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యశాఖ అద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్, ఇన్‌ఛార్జీ డీఈఓ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి హజరై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్ విద్యార్థులతో ముడిపడి ఉందని విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. జిల్లాలో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మారుమూల గ్రామాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోదిస్తూ అంకిత బావంతో పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో అనేక మౌళిక వసతులు కల్పిస్తుందని నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో పురోగతి సాధించాలని, పాఠశాలల్లో విద్యార్థుల హజరు 100 శాతం ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన నలుగురు పీజీ హెచ్‌ఎంలు, 22 స్కూల్ అసిస్టెంట్లు, 14 మంది ఎస్జీటీలు, ముగ్గురు కేజీబీవీ ఉపాధ్యాయులు, ఇద్దరు ఈఆర్పీలు, 13 మంది గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యా యులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, విద్యశాఖ అధికారి ఉదయ్‌బాబు, బీసీ సంక్షేమాధికారి సజీవన్, పీఏసీఎస్ ఛైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మత్స్యకారులకు అండగా ఉంటాం
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా యంత్రాంగం మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం విజయ వాహిణి చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ సౌజన్యంతో మత్స్యకారులకు బోటు, వలలు, టార్చీలైట్లు ఇతర పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులకు అందిస్తున్న పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవా హిణి చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ వారు చేపలు పట్టే వారికి అత్యధునిక పరిక రాలు అందజేయడం అభినందనీయమని చెప్పారు. జిల్లా యంత్రాంగం మత్స్యకార కుటుంబాలకు ఎల్లప్పుడు తోడుగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద వివిధ వ్యాపారాలు నిర్వహించేందుకు ప్రొత్సహిస్తోందని చెప్పారు. చేపలు పట్టి మార్కెట్‌కు తరలించేందుకు స్టోరేజీ కోసం యంత్రాలను అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అదికారి సాంబశివరావు, విజయవాహిణి చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.