kumaram bheem asifabad- విద్యార్థుల భవితను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
ABN , Publish Date - Sep 05 , 2025 | 11:05 PM
విద్యార్థుల భవితను తీర్చిదిద్దేది, సమాజాన్ని సన్మార్గంలో దిక్సూచిలా నడిపించేది ఉపాధ్యాయుడేనని విశ్రాంత ఉద్యో గుల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్ణాగౌడ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకుని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో శుక్రవారం ఉపాధ్యాయులను సన్మానించారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవితను తీర్చిదిద్దేది, సమాజాన్ని సన్మార్గంలో దిక్సూచిలా నడిపించేది ఉపాధ్యాయుడేనని విశ్రాంత ఉద్యో గుల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్ణాగౌడ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకుని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో శుక్రవారం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణమవుతుందని, నిర్మించేది ఉపాధ్యాయుడేనని సమాజంలో కనిపించే ప్రతి సమస్యపై ఉపాధ్యాయులే స్పందిస్తేనే పరిష్కారమవుతాయని అన్నారు. గురువులు నేర్పిన విద్యతోనే తాము ఈ స్థాయికి చేరామని అన్నారు. అనంతరం అధ్యాపకులు సునీల్‌కుమార్, తుకారాం, సంతోషిణి, వినేష్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు రమేష్, సభ్యులు లింగయ్య, మధుసూదన్‌గౌడ్, గౌరక్క, పద్మ, వరలక్ష్మి, రామారావు, వెంకటేశ్వర్లు, వెంకన్న, శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జ్యోతిబాఫూలే విద్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపాఽ ద్యాయ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు పాఠాలు బోధించారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా ఎంపీపీఎస్, యూపీఎస్, ఆశ్రమోన్నత పాఠశాలల్లో శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. జైనూర్ బాలిక ఆశ్రమోన్నత పాఠశాలలో హెచ్‌ఎం పార్వతీబాయి, ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ ఫలితాలు, వందశాతం మార్కులు సాధించిన విద్యార్థులను హెఎచ్‌ఎం పార్వతీబాయి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో జాదవ్ మధుకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.