Harassing Student: పాఠశాలలో కామాంధుడు
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:47 AM
చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థునులతో అసభ్యంగా వ్యవహరించాడు. తనకు సహకరిస్తే ఏం కావాలన్నా ఇస్తానని, ఊరు చివర ఉండే తన ఇంటికి ఒంటరిగా..
విద్యార్థునులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
దేహశుద్ధి చేసిన ఓ బాలిక తల్లిదండ్రులు, బంధువులు
ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు..నల్లగొండ జిల్లాలో ఘటన
నకిరేకల్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థునులతో అసభ్యంగా వ్యవహరించాడు. తనకు సహకరిస్తే ఏం కావాలన్నా ఇస్తానని, ఊరు చివర ఉండే తన ఇంటికి ఒంటరిగా రావాలని ఓ విద్యార్థిని వేధించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో శనివారం జరిగింది. జిల్లాలోని ఓ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిషు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్ పాఠశాలలోని బాలికలతో కొన్నాళ్లుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఓ బాలిక ధైర్యం చేసి తనకు పాఠశాలలో ఆ ఉపాధ్యాయుడి నుంచి ఎదురవుతున్న వికృత చేష్టలు, అసభ్యకర ప్రవర్తనను తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సెక్సీగా ఉంటావని, తనకు సహకరిస్తే ఏం కావాలన్నా ఇస్తానని, ఊరు చివర ఉండే తన ఇంటికి ఒంటరిగా రావాలని వేధిస్తున్నారని తల్లిదండ్రులకు తెలియజేసింది. తాను పాఠశాలకు వెళ్లలేనని బాలిక తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది. దీంతో తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడి ఇంటి వద్దకు వెళ్లి నిలదీశారు. ఇంటిమీదకు వచ్చినందుకు కేసు పెడతానని శ్రీనివాస్ బాలిక తల్లిదండ్రులను బెదిరించడంతో ఆగ్రహానికి లోనైన బాలిక తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దే హశుద్ధి చేశారు. అనంతరం నకిరేకల్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేశారని పేర్కొంటూ సదరు ఉపాధ్యాయుడు కూడా బాలిక తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉపాధ్యాయుడు శ్రీనివా్‌సను సస్పెండ్ చేస్తూ డీఈవో భిక్షపతి ఉత్తర్వులు జారీ చేశారు.