ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:45 PM
ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని ఎస్సీ, ఎస్టీ టీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాడి రా జన్న అన్నారు. జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల నియ మకాల్లో అనుసరిస్తున్న రిజర్వేషన్‌ను పదోన్నతు ల కూడిన రిజర్వేషన్‌ను కల్పించాలని, క్యాడర్ కు సరిపడా రిజర్వేషన్‌ను అమలు చేయాలని అన్నా రు.
జన్నారం,ఆగస్టు31(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని ఎస్సీ, ఎస్టీ టీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాడి రా జన్న అన్నారు. జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల నియ మకాల్లో అనుసరిస్తున్న రిజర్వేషన్‌ను పదోన్నతు ల కూడిన రిజర్వేషన్‌ను కల్పించాలని, క్యాడర్ కు సరిపడా రిజర్వేషన్‌ను అమలు చేయాలని అన్నా రు. పెండింగ్‌లో ఉన్న సీపీఎస్, ఓపీఎస్‌లను అ మలు చేయాలని, జీవో నంబర్ 317 నష్టపోయిన ఉపాధ్యాయులందరిని సొంత జిల్లాలకు పంపిం చాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించా లని, గెస్ట్, పార్ట్‌టైం ఉద్యోగులకు వేతనాలు పెం చాలని జిల్లాలకు డీఈవోల పోస్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. అదే విధంగా కేజీబీవీ సమ గ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకు లు బాదావత్ ప్రకాశ్‌నాయక్, రాంటెంకి శ్రీనివాస్, గోపాల్, జాడి ధర్మయ్య, శంకర్, రత్నం తిరుపతి, పాల్గొన్నారు.04ఎంఎన్‌పీ31. బీసీ బిల్లు ఆమోదించినందుకు సంబురాలు జరుపు కుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
బీసీ ఆమోదంతో సంబురాలు
మంచిర్యాలక్రైం, ఆగస్టు31 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ రిజర్వేషన్‌లు క్లాస్ ఎత్తివేస్తూ బీసీలకు 42శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లు అమలు చేసినందుకు మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాలు స్తూ మిఠాయిలు పంచుతు సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లీఖార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మినాక్షీ నటరాజన్, మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు రిజర్వేషన్లు దక్కాయన్నారు. ఈ సందర్భంగా బాణాసంచాలు కా లుస్తూ మిఠాయిలు తినిపించుకొని సంబురాలు జరుపుకున్నారు. ఈకార్య క్రమంలో టీపీసీసీ ఉపాద్యక్షుడు చిట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, బీసీసెల్ జిల్లా అద్యక్షులు రాజమౌళి పాల్గొన్నారు.