Share News

Jaggareddy: హరీశ్‌ మీద కోపంతోనే కాంగ్రెస్‌లోకి వెళ్లానన్నది అవాస్తవం

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:30 AM

హరీశ్‌రావు మీద కోపంతోనే తాను కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లానంటూ కేసీఆర్‌ కూతురు కవిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీన్ని తాను పూర్తిగా ఖండిస్తున్నానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి స్పష్టం......

Jaggareddy: హరీశ్‌ మీద కోపంతోనే కాంగ్రెస్‌లోకి వెళ్లానన్నది అవాస్తవం

  • కవిత చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా

  • కుసుమ్‌ ద్వారా వైఎస్‌ నుంచి ఆహ్వానం

  • ఆయన పిలిస్తేనే నేను కాంగ్రెస్‌లో చేరా

  • మేం చేరినందుకే సంగారెడ్డికి ఐఐటీ, పటాన్‌చెరు-సంగారెడ్డి హైవే ఇచ్చారు

  • నాకు, హరీశ్‌కు మధ్య పోరు సహజమే

  • రాజకీయ శత్రువులమైనా పని పురుగులం

  • సంగారెడ్డిలో నేను రాహుల్‌గాంధీ సభ పెడితే.. హరీశ్‌ను కేసీఆర్‌ తిట్టిండు

  • ఆ తర్వాత ఎన్నికల్లో హరీశ్‌రావు నన్ను ఓడగొట్టాలని చూసిండు: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): హరీశ్‌రావు మీద కోపంతోనే తాను కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లానంటూ కేసీఆర్‌ కూతురు కవిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీన్ని తాను పూర్తిగా ఖండిస్తున్నానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అప్పటి సీఎం వైఎ్‌సఆర్‌ ఆహ్వానం మేరకే తాను, తన భార్య నిర్మల కాంగ్రె్‌సలో చేరామని తెలిపారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. తాను బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరడంపై కవిత సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను పార్టీ మారడానికి, హరీశ్‌రావుకు ఏ సంబంధమూ లేదన్నారు. కవిత కేసీఆర్‌ కూతురు కాబట్టి లీడర్‌ అయ్యారని.. తాను వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎదిగినవాడినని గుర్తు చేశారు. కవిత ఇంటి పంచాయతీలో తనను ఎందుకు ఇరికిస్తారంటూ నిలదీశారు. ‘‘అప్పట్లో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా తాము జగ్గారెడ్డిని తట్టుకోలేమంటూ జిల్లా కాంగ్రెస్‌ నేతలు వైఎ్‌సఆర్‌కు చెబితే.. ఐపీఎస్‌ వ్యాస్‌కు సంగారెడ్డి ఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. వ్యాస్‌ నన్ను హౌస్‌ అరెస్టు చేస్తే.. జనం కోపంతో పోలింగ్‌ బూత్‌లకు ఎగబడి మా అభ్యర్థులను గెలిపించారు. అది చూసి, నా రాజకీయం నచ్చిన వైఎ్‌సఆర్‌.. నా మిత్రుడు జెట్టి కుసుమ్‌కుమార్‌తో కబురు పంపారు. కుసుమ్‌కుమార్‌ నన్ను వైఎ్‌సఆర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చెయ్‌.. సంగారెడ్డికి ఐఐటీ, పటాన్‌చెరు-సంగారెడ్డి నాలుగు లేన్ల హైవే ఇస్తానని వైఎ్‌సఆర్‌ చెప్పారు. దానితో నేను కాంగ్రె్‌సలో చేరాను. అంతేతప్ప హరీశ్‌పై కోపంతో బీఆర్‌ఎ్‌సను వీడలేదు’’ అని జగ్గారెడ్డి వివరించారు. ఆ సమయంలో కేసీఆర్‌ కూతురు కవితకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని.. ఆమె ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థంకావడం లేదన్నా రు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నుంచి తాను, బీఆర్‌ఎస్‌ నుంచి హరీశ్‌రావు కొట్లాడుతూనే ఉంటామన్నారు. తమ కొట్లాట ఆగేది కాదన్నది ప్రజలకు కూడా తెలుసునని, కవితకు తెలియకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. తాను సంగారెడ్డిలో రాహుల్‌గాంధీ సభ పెట్టి విజయవంతం చేస్తే.. కేసీఆర్‌ హరీశ్‌రావును పిలిచి తిట్టారని.. దానితో తర్వాత ఎన్నికల్లో హరీశ్‌రావు తనను ఓడగొట్టాలని చూశారని చెప్పారు. తాను, హరీశ్‌ పని పురుగులమని, అందుకే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తామే కనిపిస్తూ ఉంటామని పేర్కొన్నారు.


నా చిరాకుకు కారణమెవరో మే నెలలో చెబుతా!

‘‘ఈ మధ్య కొంత డిస్ట్రబ్డ్‌గా ఉన్న. జగ్గారెడ్డి సీఎం అవుతాడంటూ ఎవరైనా మాట్లాడితే చిరాకు అనిపిస్తుంది. అందుకే పార్టీ సమావేశాల్లో ఎవరి ఫొటోలు పెట్టవద్దు.. రాహుల్‌గాంధీ ఫొటో ఒక్కటే పెట్టండి అని చెప్పాను. ఎవరి వల్ల నేను డిస్ట్రబ్‌ అయ్యానన్నది మే నెలలో చెబుతాను. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు’’ అని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Dec 15 , 2025 | 04:30 AM