Share News

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - May 07 , 2025 | 12:01 AM

ప్రభుత్వం ప్రవేశపె డుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకో వాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నకిరేకల్‌లో చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్‌, మే 6, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రవేశపె డుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకో వాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్‌, కేతేపల్లి, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాలకు చెందిన 300మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలనలో నేరుగా తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసు కుంటే పథకాలు మంజూరవుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పూజార్ల శంభయ్య, నకిరేకల్‌, చిట్యాల ఏఎంసీ చైర్మన్‌లు గుత్తా మంజుల మాధవరెడ్డి, నర్రా వినోద మోహన్‌రెడ్డి, నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చెవుగోని రజిత శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కేతేపల్లి: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంగళవారం నకిరేకల్‌ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం అందజేశారు. ఇటీవల మండల వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 34మందికి కల్యాణలక్ష్మి, 10మందికి సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరయ్యింది. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ గుత్తా మంజుల, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కె. శ్రీనివాసయాదవ్‌, నాయకులు జి.మాధవరెడ్డి, బడుగుల నరేందర్‌యాదవ్‌, మట్టి సాల్మన్‌, కత్తుల వీరన్న, కె.కృష్ణయ్య, వినయసాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 12:01 AM