kumaram bheem asifabad- కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:30 PM
ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికిపండ్ల నరహరి ఐఎఎస్ నిర్మించిన ఆలయ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ద్వారా ఏర్పాటు చేసిన ఉచితి కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
రెబ్బెన, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికిపండ్ల నరహరి ఐఎఎస్ నిర్మించిన ఆలయ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ద్వారా ఏర్పాటు చేసిన ఉచితి కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలని తపనలో ఆలయ ఫౌండేషన్ వారు ఉచితి కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయటం హర్షనీయమన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేత్ర పరీక్షలపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ 40 సంవత్సరాలు దాటిన వారు పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ ప్రతినిఽధులు పరికిపండ్ల రాము, శోభన్‌బాబు, మిట్టపల్లి రాజేందర్, ప్రజా ప్రతినిధులు ఆజ్మీర శ్యాం నాయక్, వైద్యులు పాల్గొన్నారు.