Share News

kumaram bheem asifabad- కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 21 , 2025 | 10:08 PM

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌, అయినం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినకొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవా లన్నారు.

kumaram bheem asifabad-  కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

దహెగాం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌, అయినం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినకొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవా లన్నారు. లాగే ఒడ్డుగూడ- కల్వాడ 15 కిలోమీటర్ల మేరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి రూ.41 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, డీసీఎస్‌వో వసంతలక్ష్మి, డీఏవో వెంకటి, ఏడీఏ మనోహర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దేవయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతిగౌడ్‌, ఏవో రామకృష్ణ, తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌,, పీఏసీఎస్‌ సీఈవో బక్కయ్య, ఏఈవోలు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలం బొప్పురం గిరిజన గ్రామానికి రోడ్డు, వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు, వంతె నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రోడ్డు, వంతెన నిర్మాణానికి రూ.3.13 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. అనంతరం ఇటీవల దహెగాం మండల కేంద్రంలో సాగర్‌గౌడ్‌, గోపాల్‌ మృతి చెందడంతో బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతిగౌడ్‌, వైస్‌చైర్మన్‌ ధనుంజయ్‌, నాయకులు ప్రభాకర్‌గౌడ్‌, సంజీవ్‌, సత్యనారాయణ, రమేశ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 10:08 PM