కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:48 PM
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దుతు ధర పొందాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
ఉప్పునుంతల. నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దుతు ధర పొందాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్ర భుత్వం నిబంధనల మేరకు తాలు, తేమ లేకుం డా ధాన్యం కేంద్రాలకు తీసుకవచ్చి మద్దుతు ధ రపొందాలని ఆయన సూచించారు. కార్యక్రమం లో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చై ర్మన్ రజితమల్లేష్, జిల్లా సహకార సంఘం అధి కారి రఘనాఽథరావు, సూపరింటెం డెంట్ మధు, మండల వ్యవసాయాధికారి రమేష్, పీఏసీఎస్ సీఈవో రవీందర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ భూ పాల్‌రావు, నాయకులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనం తరెడ్డి, మాజీ జడ్పీటీసీ అనంతప్ర తాప్‌రెడ్డి, మామిళ్లపల్లి ఆలయ చైర్మన్ నరసింహారావు ఉన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
అమ్రాబాద్ (ఆంధ్రజ్యోతి) : అ మ్రాబాద్ మండల పరిధిలోని మా ధవానిపల్లి గ్రామానికి చెందిన శవ్వ బోడమ్మ (బాలమ్మ) అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. బుధవారం దశదిన కర్మ జర గా, ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరై కుటుంబ సభ్యు లను పరామర్శించారు. కాంగ్రెస్ నేతలు బాలిం గంగౌడ్, కంచి రామయ్య, కుంద మల్లికార్జున్, చింతల రాజగోపాల్, బి.లింగం ఉన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఊర్కొండ (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఊర్కొండపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ఏఈవో మానస బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీని వాసులు, వహీద్, రవీందర్‌గౌడ్, షైబాజ్, రమే ష్, అశోక్, శ్రీశైలం, అఖిల్ మహిళ సంఘాల నా యకులు మాధవి, శశికళ పాల్గొన్నారు.