కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 10:45 PM
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చే స్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెన్నూరు ఎ మ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి
చెన్నూరు, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : రైతులు ప్రభుత్వం ఏర్పాటు చే స్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెన్నూరు ఎ మ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఎర్రగుంటపల్లి, నాగాపూర్, పొన్నారం, బీరెల్లి, సోమనపల్లి గ్రామాల్లో పీ ఏసీఎస్, ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రా లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొం దాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రై తుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం సీసీ రోడ్ల ని ర్మాణానికి శంకుస్ధాపన చేశారు. బీరెల్లిలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ల ను పరిశీలించారు. అనంతరం ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతిచెందిన క ర్నాల లింగయ్య కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం జై బాపు, జై భీం, జైసంవిధాన కార్యక్రమంలో భాగంగా సోమనపల్లి గ్రామంలో పా దయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు.