వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Aug 04 , 2025 | 11:28 PM
ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రాథమిక అరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైనా వైద్య సేవలు అందిస్తుందని, ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నస్పూర్‌లోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంను సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్ అకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రాథమిక అరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైనా వైద్య సేవలు అందిస్తుందని, ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నస్పూర్‌లోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంను సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్ అకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వార్డులు, పరిసర ప్రాంతాలను పరిశీలించి అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది, వైద్యులు సమయ పాలన గురించి తెలుసుకుని వార్డులను సందర్శించి, హాజరు రిజిస్టర్, మందుల నిల్వల రిజిస్టర్లను తనిఖీ చేశారు. వర్షకాలంలో వ్యాధుల నివారణకు జాగ్రత్తలు పాటించాలని, వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. వైద్యులు సమయపాలన పాటించాలని, ఎల్లవేళల అందుబాటులో ఉంటూ ప్రలజకు వైద్య సేవలు అందించాలన్నారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. అనంతరం సీసీసీలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, మూత్రశాలలను పరిశీలించారు. విద్యార్థుల అరోగ్యం పట్ల శ్రద్ద వహించాలన్నారు. మోను ప్రకారం పోషక విలువల గల ఆహారం అందించాలని, శుద్దమైన మంచినీటిని అందించాలన్నారు. వర్షకాలం కావడం వలన పరిశుభ్రత పరిసరాల శుభ్రత ఎంతో అవసరమన్నారు. పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వివిధ సబ్జెక్టులతో ప్రశ్నలు అడిగి విద్యార్థుల సమర్థ్యాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్, కస్తూర్భా పాఠశాల ప్రిన్సిపల్ మౌనిక వైద్య, విద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.