kumaram bheem asifabad- శిథిలావస్థలో తహసీల్దార్ కార్యాలయం
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:14 PM
ప్రజలకు అందుబాటులో ఉండి రైతులకు, విద్యార్థులకు వివిద రకాల సేవలు అందిస్తోన్న తహసీల్దార్ కార్యాలయం శఽథిలావస్థకు చేరడంతో అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోని కింది గచ్చు పూర్తిగా ఊడిపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గత మూడేళ్ల నుంచి కింద వేసిన టైల్స్ పూర్తిగా పగిలిపోయి మట్టి బయటకు రావడంతో నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు
- మరమ్మతులు చేపట్టాలని వినతి
బెజ్జూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు అందుబాటులో ఉండి రైతులకు, విద్యార్థులకు వివిద రకాల సేవలు అందిస్తోన్న తహసీల్దార్ కార్యాలయం శఽథిలావస్థకు చేరడంతో అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోని కింది గచ్చు పూర్తిగా ఊడిపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గత మూడేళ్ల నుంచి కింద వేసిన టైల్స్ పూర్తిగా పగిలిపోయి మట్టి బయటకు రావడంతో నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో కుమరం భీం ప్రాజెక్టు భూసేకరణ నిధుల వడ్డీ రూ.17లక్షల వ్యయంతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో పాటు మూడేళ్ల నుంచి టైల్స్ పూర్తిగా చెడిపోవడంతో అధికారులు మరమ్మత్తులు చేయకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. మరమ్మతుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపినా నిధులు మంజూరు కావడం లేదని అధికారులు వాపోతున్నారు. కార్యాలయానికి వివిద పనుల కోసం వచ్చే ప్రజలు, అధికారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పైనుంచి వర్షపు నీరు కూడా ఊరుస్తుండటంతో కంప్యూటర్లు, వివిద రకాల దస్ర్తాలు తడిచిపోతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. ప్రతినిత్యం వివిద రకాల సమస్యల కోసం వచ్చే రైతులు, ఇతరులతో కార్యాలయం సందడిగా ఉండే తహసీల్దార్ కార్యాలయం మరమ్మత్తులు చేపట్టేందుకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు.
- నిధులు మంజైరైనా..
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణానికి గత నాలుగు నెలల క్రితం ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.2.50లక్షలు మంజూరైనా ఇప్పటికీ పనులను చేపట్టడం లేదు. కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కార్యాలయానికి వివిద పనుల కోసం వచ్చే మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని మరమ్మతులు చేపట్టాలని మండల ప్రజలు కార్యాలయ సిబ్బంది కోరుతున్నారు.