T Wallet: టీ-వాలెట్ ద్వారా 36వేల కోట్ల లావాదేవీలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:50 AM
తెలంగాణ టీ-వాలెట్ 2017లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 36,000 కోట్లకు పైగా లావాదేవీలను జరిపింది. త్వరలో యూపీఐ, క్యూఆర్ కోడ్ ఆధారిత కొనుగోళ్లు,..
త్వరలో యుపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు: మంత్రి దుద్దిళ్ల
తెలంగాణ టీ-వాలెట్ 2017లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 36,000 కోట్లకు పైగా లావాదేవీలను జరిపింది. త్వరలో యూపీఐ, క్యూఆర్ కోడ్ ఆధారిత కొనుగోళ్లు, ఆటోమేటెడ్ బిల్ పేమెంట్ వంటి సేవలను ప్రారంభించనుంది. వాలెట్ పనితీరుపై మంగళవారం సమీక్ష జరిపిన రాష్ట్ర ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ విషయాలను వెల్లడించారు. టీ-వాలెట్‌లోని ఇన్‌స్టంట్ మనీ పేమెంట్ సర్వీస్ గేమ్‌చేంజర్‌గా మారిందని తెలిపారు. ఇప్పటివరకు 16.14 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారని చెప్పారు. 1,246 ప్రభుత్వ, పౌర సేవలు ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉన్నాయన్నారు. గత ఎనిమిదేళ్లలో టీ-వాలెట్ ఒక విశ్వసనీయమైన సురక్షిత చెల్లింపుల వేదికగా నిలిచిందని, ఐఎంపీఎస్ లావాదేవీలలో 99ుకు పైగా విజయవంతమైన రికార్డు సాధించిందని వివరించారు.