Share News

సర్వేయర్‌ లేక అవస్థలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:39 PM

మండలంలో రెగ్యులర్‌ సర్వేయర్‌ లేకపోవడంతో ఏడాదిన్నర నుం చి రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.

 సర్వేయర్‌ లేక అవస్థలు
కట్టంగూరు తహసీల్దార్‌ కార్యాలయం

సర్వేయర్‌ లేక అవస్థలు

తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు

పెండింగ్‌లో సర్వే దరఖాస్తులు

ఇబ్బందులు పడుతున్న రైతులు

కట్టంగూరు, జూలై30(ఆంధ్రజ్యోతి): మండలంలో రెగ్యులర్‌ సర్వేయర్‌ లేకపోవడంతో ఏడాదిన్నర నుం చి రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. సర్వేయ ర్‌ అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ ప్రాం తాల్లో భూ సమస్యలతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతీ రోజూ భూసర్వే కోసం కార్యాల యం చుట్టూ తిరుగుతున్న రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. కట్టంగూరు మండలానికి కొన్ని నెలల నుంచి రెగులర్‌ సర్వేయర్‌ లేకపోవడంతో ఇనచార్జి సర్వేయర్‌ నియమించారు. అప్పటి నుంచి రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొన్ని రోజలు పాటు కేతేపల్లి మండల సర్వేయర్‌ ఇనచార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం నకిరేకల్‌ సర్వేయర్‌ ఇనచార్జిగా ఉన్నా రైతులకు అందుబాటులోకి రాకపోవడంతో వా రి బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక సతమతమవుతున్నారు. మీ సేవలో సర్వే కోసం దరఖాస్తు చేసుకొని నెలల తరబడి వేచిచూడాల్సి వస్తోందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మండలవ్యాప్తంగా సర్వే పెట్టుకున్న దరఖాస్తులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కట్టంగూరు మండల వ్యాప్తంగా 22 గ్రామపంచాయతీలతో పాటు మరో 2 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. మండలవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమా రు 80 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని నెలల నుంచి ఇనచార్జిగా ఉన్న నకిరేకల్‌ సర్వేయర్‌ ఎప్పుడు వస్తాడో? ఎప్పుడు వెళతారో? తెలియని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. భూసర్వే కోసం రైతుల మీసేవలో చలానాలుకట్టినా నెలల త రబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ సర్వేయర్‌ అందుబాటు లో లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో డబ్బులు వె చ్చించి ప్రైవేట్‌ సర్వేయర్లతో భూములను సర్వే చే యించుకుంటున్నామని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్‌ సర్వేయర్‌ నియమించాలని రైతులు కోరుతున్నారు.

ఈ విషయమై ఇనచార్జి తహసీల్దార్‌ వెంకటేశ్వర్‌రావును వివరణ కోరగా మండలంలో సర్వేయర్‌ కొరత నిజమేనని అన్నారు. ఈ విషయాన్ని జాయిం ట్‌ కలెక్టర్‌, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నకిరేకల్‌ సర్వేయర్‌ను కట్టంగూరుకు పంపించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

చలాన కట్టి 20 నెలలు

భూమి సర్వే కోసం చలాన (టీఫన) కట్టి సుమారు 20 నెలలు అవుతుంది. కార్యాలయం చుట్టూ తిరిగి చెప్పులు అరుగుతున్నా యే తప్ప సర్వేయర్‌ దొరకడం లేదు. ఈదులూ రు గ్రామంలో సర్వే నెంబర్‌ 145లో 1.10 ఎకరా ల భూమిని సర్వే చేయడం కోసం చలాన కట్టా రు. రెవెన్యూ అధికారులు రెండు సార్లు నోటీ్‌స లు ఇచ్చినా సర్వేయర్‌ అందుబాటులోకి రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెగ్యులర్‌ సర్వేయర్‌ను నియమించాలి.

- దాసరి యాదగిరి, రైతు, ఈదులూరు

Updated Date - Jul 30 , 2025 | 11:39 PM