Share News

kumaram bheem asifabad- పల్లెల్లో స్వచ్ఛతపై సర్వే

ABN , Publish Date - Jul 01 , 2025 | 10:59 PM

గ్రామాలన్నీ స్వచ్ఛంగా విలసిల్లాలనే సంకల్పంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2025లో భాగంగా పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు గ్రామ పంచాయతీల్లో కేంద్ర బృం దం బుధవారం సర్వే నిర్వహించనుంది. కేంద్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో అకాడమి ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ అనే సంస్థ నుంచి పలువురు ప్రతినిధులు పర్యవేక్షణకు రానున్నారు.

kumaram bheem asifabad- పల్లెల్లో స్వచ్ఛతపై సర్వే
లోగో

- సమాచారం ఇవ్వకుండా కేంద్ర బృందం పరిశీలన

- ఉత్తమ గ్రామాలకు ర్యాంకులు, పురస్కారాలు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి) గ్రామాలన్నీ స్వచ్ఛంగా విలసిల్లాలనే సంకల్పంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2025లో భాగంగా పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు గ్రామ పంచాయతీల్లో కేంద్ర బృం దం బుధవారం సర్వే నిర్వహించనుంది. కేంద్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో అకాడమి ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ అనే సంస్థ నుంచి పలువురు ప్రతినిధులు పర్యవేక్షణకు రానున్నారు. చెత్త సేకరణ తీరు, పారిశుధ్య సిబ్బంది చెత్త తరలింపు, ప్రభుత్వ సంస్థల పనితీరు తదితర అంశాలపై నేరుగా ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరిస్తారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయా గ్రామ పంచాయతీల సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

- ప్రగతి పనులపై ఆరా..

ఆయా గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితి, ప్రగతి పనుల౅ పౖ అధికారులు పంపిన నివేదికల అదారంగా క్షేత్రస్థా యిలో సర్వే నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల న్నింటినీ పరిశుభ్రంగా మార్చాలనే ఉద్దేశ్యంతో పంచా యతీల మధ్య స్నేహ పూర్వకమైన పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొని మా ర్కులు కేటాయిస్తూ సర్వే నిర్వహిస్తారు. సర్వేలో భాగం గా మొత్తం 1,000 మార్కులకు ఈ పోటీ నిర్వహిస్తు న్నారు. మెరుగైన ర్యాంకులు సాధిస్తే జాతీయ స్థాయి లో పురస్కారం అందజేస్తారు. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకున్నారా దానిని వినియోగిస్తున్నారా, పారిశు ధ్య సిబ్బంది నిత్యం చెత్త సేకరిస్తున్నారా, ఇంకుడు గుం తలు ఉన్నాయా, యార్డుల్లో వ్యర్థాల నిర్వహిణ అమలు, పచ్చదనం పెంపు, శుద్ధమైన తాగునీటి సరఫరా అంగన్‌వాడీ కేంద్రం ప్రభుత్వ పాఠశాల, బహిరంగ ప్రదేశాల్లో పారిశుధ్య పరిస్థితి,. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలు గ్రామాల్లో ఎలా నడుస్తున్నాయి తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని సర్వే చేస్తారు. అయా అంశాల అదారంగా వేయి మార్కులు కేటాయిస్తారు. ఎక్కువ మార్కులు సాదించిన పంచాయతీలకు స్వచ్ఛ ర్యాంకులను ప్రకటిస్తారు.

- ఎంపిక చేసిన గ్రామాల్లో..

పంచాయతీల్లో కేంద్ర బృందం ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టనుంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సమాచారం ఆధారంగా ఏ గ్రామాలకు వెళ్లలనేది నిర్ణయిస్తారు. గ్రామంలో 16 ఇళ్లను సందర్శించి వారి అభిప్రాయాలు తీసుకొని పరిశీలిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర గృహాల సభ్యులతో సర్వే చేస్తారు. అనంతరం సర్వేలో తెలిన అంశాల నివేదికను కేంద్రానికి పంపుతారు. జిల్లాలో స్వ చ్ఛ సర్వేక్షణ్‌ బృందం రానున్న సందర్భంగా ఉన్నతా ధికారులు అప్రమత్తంగా ఉన్నారు. గ్రామాల్లో స్వచ్చ్ఛ వాతావరణం నెలకొనేలా పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు.

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతాం..

- భిక్షపతిగౌడ్‌, జిల్లా పంచాయతీ అధికారి

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2025లో భాగంగా గ్రామాలను సర్వే చేసేందుకు త్వరలో కేంద్ర బృందాలు జిల్లాకు రానున్నా యి ఈ బృందాలు ఏ సమయంలో ఏ గ్రామంలో పర్యటించే సమాచారం ఉండదు. అప్పటికప్పుడు బృం దాలు గ్రామాలను సందర్శిస్తాయి. ఈ నేపథ్యంలో అన్ని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీకి సిద్ధం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులకు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచనలు చేశాం.

Updated Date - Jul 01 , 2025 | 10:59 PM