kumaram bheem asifabad-నిఘా పటిష్ఠం చేయాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:27 PM
అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కౌటాల సర్కిల్ పోలీసు కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేకుండా చూడాలని, జరిగిన నేరాలను సర్కిల్ మ్యాప్‌లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.
కౌటాల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కౌటాల సర్కిల్ పోలీసు కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేకుండా చూడాలని, జరిగిన నేరాలను సర్కిల్ మ్యాప్‌లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. గ్రేవ్ కేసులపై నాణ్యమైన దర్యాప్తు చేసి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మర్డర్, డౌరీ డెత్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అవసరమైతే టెక్నికల్ సపోర్టు వినియోగించుకోవాలని సూచించారు. సర్కిల్ పరిధిలో గల పోలీసు స్టేషన్లను తరుచుగా సందర్శిస్తూ ఆయా కేసులపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని అన్నారు. అలాగే సర్కిల్ పరిధిలో ఉన్న కేడీ, సస్పెక్ట్, రౌడీ షీట్స్ తెరిచిన వ్యక్తులను నిరంతరం చెక్ చేస్తూ వారి కదిలికలపై నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా ఆస్తి సంబంధిత నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను క్రైం హాట్‌స్పాట్‌గా గుర్తించి నిఘాను మరింత బలోపేతం చేయాలని సూచించారు. నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేయాలని అన్నారు. సర్కిల్ పరిధిలో ఉన్న లాంగ్ పెండింగ్ కేసులు, ఎన్‌బీడబ్ల్యూఎస్ వెంటనే ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు. అంతర్‌రాష్ట్ర సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలన్నారు. సర్కిల్ పరిధిలో గంజాయి లాంటి మాదకద్రవ్యాల నిర్మూలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సర్కిల్ కార్యాలయం రికార్డుల నిర్వహణ దర్యాప్తు తీరు సంతప్తికరంగా ఉందని అభినందించారు. సీఐ సంతోష్‌కుమార్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతకు ముందు సీఐ కార్యాలయం రికార్డులను, పరిసర పరిశుభ్రతను పరిశీలించి అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న గ్రేవ్ కేసుల వివరాలను సీఐ సంతోష్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ వాహిదుద్దీన్‌తో కలిసి మొక్కలు నాటారు.