Share News

Amit Shah Warn: లొంగిపోతే రెడ్‌కార్పెట్‌.. లేదంటే ఎన్‌కౌంటరే

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:15 AM

మావోయిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోవాలని.. తుపాకీ వీడితే రెడ్‌ కార్పెట్‌ వేస్తామని, లేదంటే ఎన్‌కౌంటర్లు తప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా...

Amit Shah Warn: లొంగిపోతే రెడ్‌కార్పెట్‌.. లేదంటే ఎన్‌కౌంటరే

  • మావోయిస్టులతో చర్చలుండవు

  • ఛత్తీ్‌సగఢ్‌ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

చర్ల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : మావోయిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోవాలని.. తుపాకీ వీడితే రెడ్‌ కార్పెట్‌ వేస్తామని, లేదంటే ఎన్‌కౌంటర్లు తప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హెచ్చరించారు. ఛత్తీ్‌సగఢ్‌లోని జగ్దల్‌పూర్‌లో బస్తర్‌ దసరా లోకోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా శనివారం జరిగిన ఓ సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు. మావోయిస్టులు శాంతి చర్చలు అంటూ లేఖలు విడుదల చేస్తున్నారని.. ఇంకా మాట్లాడేందుకు ఏముందని ప్రశ్నించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 2026 లక్ష్యంగా బలగాలు కదులుతున్నాయని వచ్చే మార్చి 31నాటికి దేశంలో మావోయిస్టులు అనేవారు ఉండరన్నారు. ఇంకా బస్తర్‌లో శాంతికి విఘాతం కలిగిస్తే భద్రతాదళాలు ఆయుధాలతో సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. దంతేశ్వరి మాతకు కూడా మొక్కుకున్నానని, మావోయిస్టుల నుంచి బస్తర్‌ను విముక్తి చేసేందుకు బలగాలకు బలం చేకూర్చాలని కోరుకున్నానని తెలిపారు. కొంత కాలంగా ఢిల్లీలో చాలామంది నక్సలిజం పుట్టుక అభివృద్ధి కోసమేనని తప్పుడు ప్రచారం చేశారని, బస్తర్‌ మొత్తం అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. నేడు బస్తర్‌లో రోడ్లు, మొబైల్‌ టవర్లు, విద్య, వైద్యం కల్పించడంతోపాటు పేదలకు రూ.25 లక్షల వరకు బీమా, 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఛత్తీ్‌సగఢ్‌ అభివృద్ధికి మోదీ ప్రభు త్వం గత పదేళ్లలో రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, వచ్చే మార్చి 31 తరువాత ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. ఇక్కడ జరిగే దసరా పండుగ దేశంలో 75 రోజులు జరిగే అతిపెద్ద పండుగని అమిత్‌షా కొనియాడారు.

Updated Date - Oct 05 , 2025 | 05:15 AM