సుర్రుమంటున్న సూరీడు..
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:39 PM
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి ప్ర జలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 7 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బ యటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ము ఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చే రుకుంటుండటంతో ఎండ వేడిమిని తాళలేక పోతు న్నారు
-జిల్లాలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
-ఆరెంజ్ హెచ్చరికలతో అప్రమత్తం
-ఉదయం 7 గంటల నుంచే సూర్య ప్రతాపం
-బయటకు రావాలంటేనే జంకుతున్న జనం
-సింగరేణి గనులపై పరిస్థితి దయనీయం
మంచిర్యాల, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి ప్ర జలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 7 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బ యటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ము ఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చే రుకుంటుండటంతో ఎండ వేడిమిని తాళలేక పోతు న్నారు. వారం రోజులుగా విపరీతమైన ఎండలతో ప్ర జలు సతమతమవుతున్నారు. గడిచిన నాలుగైదు రో జులుగా జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు నమోదవుతుండడమే దీనికి కారణం.
క్రమేపీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.....
జిల్లాలో వారం రోజుల నుంచిఉష్ణోగ్రతలు క్రమే పీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పగటి వేళలో రికా ర్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ప్రజ లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడం ఆందోళనకు రేకెత్తిస్తోంది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల్లో అండర్ గ్రౌండ్ బొ గ్గు బావులతో పాటు ఓపెన్‌కాస్టు మైన్‌లు అధిక సం ఖ్యలో ఉండడంతో ఇక్కడి వాతావరణం తీవ్రంగా వే డుక్కుతోంది. చిన్న చిన్న అవసరాలకు కూడా బయ టకు వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగ డంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతు న్నారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోతకు గురవు తుండగా సామాన్య జనం ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లాలం టేనే ప్రజలు జంకాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి.
బొగ్గు గనుల్లో పరిస్థితి దయనీయం...
క్రమేపీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా సిం గరేణి బొగ్గు గనుల్లో కార్మికుల పరిస్థితి అత్యంత ద యనీయంగా మారింది. సెకండ్ షిఫ్ట్‌లో విధుల్లోకి వెళ్లే కార్మికులు ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మొదటి షిఫ్టు పూర్తి చేసుకు న్న వారు సైతం మండుటెండలో ఇళ్లకు వెళ్లాల్సి వ స్తోంది. సాధారణ ప్రాంతాలతో పోల్చితే బొగ్గు గను లు ఉన్న ఏరియాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. ముఖ్యంగా ఓపెన్‌కాస్టు గని కార్మికులు ఎండ వేడికి కుదేలవుతున్నారు. దీంతో పని వేళల్లో మార్పులు చేయాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నా యి. గతంలో వేసవి ఎండలకు సింగరేణిలో పనివేళ ల్లో మార్పు లు చేసేవారు. పదేళ్లుగా ఆ పద్ధతికి స్వస్తి పలకడంతో కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణ రోజుల్లో ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 6 గం టల నుంచి మఽధ్యాహ్నం 2 గంటల వరకు, సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అయితే ఎండలు పెరిగినప్పుడు పై రెం డు షిఫ్టుల్లో పని వేళలను యాజమాన్యం గంట ముందుకు మార్చేది. అలా ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 5 నుంచి మఽధ్యాహ్నం ఒంటి గంట వరకు, రెండో షి ఫ్ట్‌ను సాయంత్రం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు మార్పులు చేసేవారు. దీంతో ఎండవేడి నుంచి కార్మి కులు ఉపశమనం పొందేవారు. గతంలోలాగే పని వేళల్లో మార్పులు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
పది రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు...
జిల్లాలో గడిచిన పది రోజుల్లో నమోదైన ఉష్ణోగ తల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 12న జిల్లాలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఈ నెల 13న 43.6 డిగ్రీలు, 14న 43.1 డి గ్రీలు, 16న 41.4 డిగ్రీలు, 17న 40.7 డిగ్రీలు, 18న 41.7 డిగ్రీలు, 19న 41.7 డిగ్రీలు, 21న 42.8 డిగ్రీలు, 22న 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉ ష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు వస్తుండటంతో జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఏప్రిల్‌లోనే ఎండలు తీవ్రరూపం దాల్చుతుండటంతో రాబోయే మే నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందో ళన ప్రజల్లో నెలకొంది.
ఎల్లంపల్లి ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి మట్టం...
జిల్లాలోని గుడిపేట సమీపంలోగల శ్రీపాద ఎల్లం పల్లి ప్రాజెక్టులో నీటి మట్టం ఘననీయంగా తగ్గు ముఖం పట్టింది. మంగళవారం 8.746 టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్టు లెవల్ 148.00 అడుగుకుల కుగాను ప్రస్తుతం 142.87 అడుగుల నీరుంది. అలా గే 20.175 టీఎంసీల సామర్థ్యానికిగాను 8.746 టీఎం సీల నీరు అందుబాటులో ఉంది. ప్రాజెక్టు నుంచి హైద్రాబాద్ మెట్రో వర్క్ స్టేషన్‌కు 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఎన్టీపీసీ పంప్ హౌజ్‌కు 121 క్యూసెక్కులను నిత్యం విడుదల చేస్తున్నారు.