Share News

నాణ్యమైన ధాన్యంతో మద్దతు ధర పొందాలి

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:10 PM

మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాల యంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ను ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి బుధవారం ప్రారం భించారు.

నాణ్యమైన ధాన్యంతో మద్దతు ధర పొందాలి
తెలకపల్లి సింగిల్‌ విండో కార్యాలయంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి

- ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి

- వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం

తెలకపల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాల యంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ను ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి బుధవారం ప్రారం భించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు సెంటర్‌కి తీసుకువచ్చి కనీసం మద్దతు ధర వరికి రూ.2,389, అద నంగా సన్న రకాలకు రూ.500 బోనస్‌, మొక్క జొన్న క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. రాష్ట్రంలో తెలకపల్లి సహకార సంఘం మొ దటి స్థానం సాధించడంపై హర్షం వ్యక్తం చేశా రు. అధికారులు, చైర్మన్‌, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమానికి సంఘం కార్యవర్గ సభ్యులు, జిల్లా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు, వ్యవసా య సంచాలకులు, మండల వ్యవ సాయ అధికారి, మానిటరింగ్‌ ఆఫీ సర్‌, ముఖ్య నిర్వహణ అధికారి, సం ఘం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

బావాయిపల్లిలో..

కోడేరు (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని బావాయిపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రా న్ని గ్రామ మహిళా సంఘం అధ్యక్షు రాలు రా ములమ్మ ప్రారంభించారు. మాజీ సర్పంచు నక్క వేణుగోపాల్‌యాదవ్‌, గొర్రెల, మేకల పెం పకందారుల సంఘం అధ్యక్షుడు నక్క రాములు, కాంగ్రెస్‌ నాయకుడు నాగన్న పాల్గొన్నారు. అలా గే మండల పరిధిలోని రాజాపూర్‌ గ్రామంలో బుధవారం సింగిల్‌విండో సీఈవో ప్రకాష్‌రెడ్డి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

గోవిందాయపల్లిలో...

తాడూరు (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గోవిందాయపల్లి గ్రామంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం వరి కొనుగో లు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేం ద్రంలో ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించు కోవాలని ఏపీఎం చిట్టెమ్మ అన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 11:10 PM