BC Organizations Are Fully Backing the Bandh: 18న బీసీల బంద్‌కు మద్దతు
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:40 AM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర బంద్‌కు టీజేఎస్ సంపూర్ణ..
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.. రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలి: బీసీ సంఘాల బైక్ ర్యాలీలో కృష్ణయ్య
హైదరాబాద్/రాంనగర్, అక్టోబరు14 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర బంద్‌కు టీజేఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత కోదండరాం ప్రకటించారు. బంద్‌లో టీజేఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం కోదండరాంను కలిసిన బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ తదితరులు బంద్‌కు మద్ద తు ఇవ్వాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ.. రిజర్వేషన్ విషయంలో బీసీ సంఘాలు చేసే పోరాటాలన్నింటికీ తమ పార్టీ మద్దతుగా ఉంటుంద చెప్పారు. అంతకుముందు బీసీ రిజర్వేషన్లపై జరిగిన టీజేఎస్ ముఖ్యనేతల సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును షెడ్యూల్ 9లో చేర్చాలని, ఇందుకోసం కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల బీజేపీ, బీఆర్‌ఎ్‌సలవి ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కాగా, బీసీ రిజర్వేషన్ల కేసులో ఇంప్లీడ్ అయిన 30 బీసీ సంఘా ల వాదనలు వినకుకుండా హైకోర్టు స్టే ఇవ్వడం అన్యాయమని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన బైక్ ర్యాలీని కృష్ణయ్య ప్రారంభించి, పాల్గొన్నారు. బీసీలకు 42ు రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడం బీసీలను మోసం చేయడమేనని అన్నారు. రిజర్వేషన్లు 50ు దాటకూడదన్న నిబంధనతో అగ్రవర్ణాలు, పాలకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి: కూనంనేని
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 18న బీసీ జేఏసీ బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. బంద్‌కు తాము కూడా మద్దతిస్తున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈ నెల 17న చలో రాజభవన్ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పార్టీ శ్రేణులను కోరారు. బీసీ జేఏసీ బంద్‌కు సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.