సుందరయ్య జీవితంఎంతో స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - May 19 , 2025 | 11:18 PM
జీవితాంతం ప్రజల కోసం పోరాడిన మహానేత పుచ్చలపల్లి సుందరయ్య అందరికీ స్ఫూర్తిదాయ కమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు.
- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు
- జిల్లా కేంద్రం సుందరయ్య వర్థంతి
నాగర్‌కర్నూల్ టౌన్, మే 19 (ఆంధ్రజ్యోతి) : జీవితాంతం ప్రజల కోసం పోరాడిన మహానేత పుచ్చలపల్లి సుందరయ్య అందరికీ స్ఫూర్తిదాయ కమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబే డ్కర్ చౌరస్తాలో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. సుందర య్య చిత్రపటానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడు తూ చట్టబద్ధ పదవుల్లో ఉన్నప్పటికీ ఆడంబరా లకు పోకుండా సైకిల్‌పైనే పార్లమెంటుకు వెళ్లి ప్రజా సమస్యలపై గళం వినిపించారన్నారు. సుందరయ్య పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాల ని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీ ఎం నాయకులు రామయ్య, అశోక్, శ్రీనివాసు లు,యాదయ్య, మల్లికార్జున్, సురేష్ పాల్గొన్నారు.
సుందరయ్య జీవితం ఆదర్శం
కొల్లాపూర్ : స్వాతంత్య్ర సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం భవిష్యత్ తా రాలకు స్ఫూర్తిదాయకమని సీపీఎం మండల కార్యదర్శి శివ వర్మ అన్నారు. సుందరయ్య వర్ధం తిని ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాలో నిర్వహించారు. అగ్రకులంలో పుట్టినప్పటికీ అంటరానితనానికి వ్యతి రేకంగా పోరాడి దళితుల చేత ఆలయ ప్రవేశాలు చేయించి, సహపంక్తి భోజ నాలు నిర్వహించిన ఆద ర్శ నేత సుందరయ్య అని కొనియాడారు. కార్యక్రమం లో సీపీఎం పట్టణ కార్యదర్శి ఎండీ సలీం, నా యకులు బాలయ్య, సత్తిరెడ్డి, మధు, శ్రీను, నర సింహ, శివశంకర్, శేషయ్య, బాలకృష్ణ, రాజు, రామకృష్ణ పాల్గొన్నారు.
సుందరయ్యకు ఘన నివాళి
కల్వకుర్తి : పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి పురస్కరించుకొని కల్వకుర్తిలోని సీపీఎం కార్యా లయంలో ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. సీపీ ఎం, ప్రజా సంఘాల నాయకులు బాల్‌రెడ్డి, ఆం జనేయులు, వెంకటేశ్వర్లు, పరశురాములు, నా యకులు బి.శ్రీనివాసులు, శ్రీనివాసులు, బాల య్య, అలివేల, యాదయ్య, ప్రభాకర్‌రెడ్డి, రామా న్‌జన్, నెహ్రూ ప్రసాద్ పాల్గొన్నారు.
ఆశయాలను కొనసాగిస్తాం
తాడూరు : భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాం గ పోరాట ఉద్యమ సారథి పుచ్చలపల్లి సుంద రయ్య అని, ఆయన ఆశయాలను కొనసాగి స్తామని సీపీఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న అన్నారు. సోమవారం సుందరయ్య వర్ధంతిని తాడూరు బస్టాండ్ దగ్గర సీపీఎం ఆధ్వర్యంలో మండల కార్యదర్శి అంతటి కాశన్న నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో సీపీఎం శాఖ కార్యదర్శి ఎనుపోతుల కాశన్న, సీపీఎం నాయకులు గడ్డం బంగారయ్య, బాలరాజు, వెంకటేష్, చంద్రయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.
ఘన నివాళి
బల్మూరు : పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో సీపీఎం ఆయ న చిత్ర పటానికి సీపీఎం మండల కార్యదర్శి శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీపీ ఎం మండల నాయకులు ఎండీ లాల్ మహ మ్మద్, బాబర్, కృష్ణయ్య, ఆంజనేయులు, నాగ య్య, మాసయ్య, నారాయణ పాల్గొన్నారు.