Share News

Summative Assessment Exams: సమ్మెటివ్‌ అసెస్మెంట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Oct 11 , 2025 | 03:11 AM

పాఠశాలల్లో 2025-26 సంవత్సరానికి ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు మొదటి సమ్మెటివ్‌ అసెస్మెంట్‌ ఎస్‌ఏ పరీక్షల టైమ్‌ టేబుల్‌ను..

Summative Assessment Exams: సమ్మెటివ్‌ అసెస్మెంట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

  • ఒకటి నుంచి పదో తరగతి వరకు..ఈ నెల 24 నుంచి 31 దాకా పరీక్షలు

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో 2025-26 సంవత్సరానికి ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు మొదటి సమ్మెటివ్‌ అసెస్మెంట్‌ (ఎస్‌ఏ) పరీక్షల టైమ్‌ టేబుల్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలు ఈ నెల 24 నుంచి 31 తేదీ వరకు జరగనున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6, 8వ తరగతుల విద్యార్థులకు ఉదయం 9:15 గంటల నుంచి 12 వరకు, 7వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1:15 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1:15 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పేర్కొంది. 1 నుంచి 5వ తరగతి వరకు 27న మొదటి భాష (తెలుగు లేదా ఉర్దూ), 28న ఆంగ్లం, 29న గణితం, 30న ఈవీఎస్‌, 31న ద్వితీయ భాష తెలుగు (మొదటి భాషగా తెలుగు రాయని విద్యార్థులకు) పరీక్షలు నిర్వహించనున్నారు. 6, 7 తరగతుల విద్యార్థులకు 24న మొదటి భాష (తెలుగు లేదా ఉర్దూ), 25న ద్వితీయ భాష (హిందీ లేదా తె లుగు), 27న ఆంగ్లం, 28న సోషల్‌, 29న గణితం, 30న జనరల్‌ సైన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు 24న గణితం, 25న భౌతిక శాస్త్రం, 27న జీవ శాస్త్రం, 28న సోషల్‌ స్టడీస్‌, 29న మొదటి భాష (తెలుగు లేదా ఉర్దూ), 30న ద్వితీయ భాష (హిందీ లేదా తెలుగు), 31న ఆంగ్లం పరీక్షలు నిర్వహిస్తారు. నవంబరు 3న ఫలితాలు ప్రకటించి, 15న పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ నిర్వహిస్తారు. అన్ని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు ఈ షెడ్యూల్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Oct 11 , 2025 | 03:11 AM