Share News

Drug Trafficking: సూడాన్‌ దేశస్థుడి బహిష్కరణ

ABN , Publish Date - Sep 15 , 2025 | 06:03 AM

స్టూడెంట్‌ వీసాపై వచ్చి.. గడువు ముగిసి 12 ఏళ్లు అవుతున్నా భారత్‌లోనే ఉంటూ మాదక ద్రవ్యాల దందాకు పాల్పడుతున్న సూడాన్‌ దేశస్థుడిని హెచ్‌ న్యూ పోలీసులు..

Drug Trafficking: సూడాన్‌ దేశస్థుడి బహిష్కరణ

  • 12 ఏళ్లుగా భారత్‌లో తిష్టవేసి డ్రగ్స్‌ దందా

హైదరాబాద్‌సిటీ, సెప్టెంబరు14(ఆంధ్రజ్యోతి): స్టూడెంట్‌ వీసాపై వచ్చి.. గడువు ముగిసి 12 ఏళ్లు అవుతున్నా భారత్‌లోనే ఉంటూ మాదక ద్రవ్యాల దందాకు పాల్పడుతున్న సూడాన్‌ దేశస్థుడిని హెచ్‌ న్యూ పోలీసులు దేశ బహిష్కరణ చేశారు. హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ డీసీపీ వై.వి.సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం సూడాన్‌ దేశానికి చెందిన జబల్‌ అలియాస్‌ కుర్బా(34), 2012లో నగరానికి వచ్చి అద్దెంటిలో దిగాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో చదువును మధ్యలోనే ఆపేశాడు. టాంజానియా దేశస్థునితో కలిసి మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. 12 ఏళ్లలో మూడుసార్లు డ్రగ్స్‌ అమ్ముతూ పోలీసులకు పట్టుబడి, జైలు పాలయ్యాడు. ఇలాంటి అక్రమార్కులను దేశం నుంచి బహిష్కరించాలన్న సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు అతనిపై ఉన్న కేసుల విచారణ పూర్తిచేసి, న్యాయ పరమైన చిక్కులను అధిగమించడానికి పోలీసులు ఏడాది కాలంగా కృషి చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఢిల్లీలో సూడాన్‌ ఎంబసీ నుంచి ప్రయాణ పత్రాన్ని పొందిన పోలీసులు.. శుక్రవారం ముంబై విమానాశ్రయం నుంచి పంపించారు.

Updated Date - Sep 15 , 2025 | 06:03 AM