Dental Surgery: 3డీ ఇంప్లాంట్ దవడ కీలు మార్పిడి
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:23 AM
నాలుగేళ్లుగా నోరు తెరవలేక, ఆహారం తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సూడాన్‌కు చెందిన యువకుడికి హైదరాబాద్‌లోని...
హైదరాబాద్ మెడికవర్‌లో సూడాన్ యువకుడికి శస్త్ర చికిత్స
నాలుగేళ్లుగా నోరు తెరవలేక అవస్థ పడుతున్న రోగికి విముక్తి
హైదరాబాద్ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్లుగా నోరు తెరవలేక, ఆహారం తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సూడాన్‌కు చెందిన యువకుడికి హైదరాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ఉపశమనం కల్పించారు. కస్టమ్-మేడ్ 3డీ ఇంప్లాంట్‌తో అతని దవడ పని తీరును పునరుద్ధరించారు. సూడాన్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్ అలీ(23) నాలుగేళ్లక్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దవడకు తీవ్ర గాయమై.. దవడ ఎముక, తల ఎముకతో అతుక్కుపోయింది. ఫలితంగా దవడ కీలు చలనం పూర్తిగా ఆగిపోయింది. దీంతో అలీ నోరు తెరవలేక, మాట్లాడలేక, ఆహారం తీసుకోలేక ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో అలీని పరీక్షించిన హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్ప త్రి డెంటిస్ట్రీ, మెక్సిలోఫేషియల్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ శరత్‌బాబు వైద్య బృందం.. రోగికి సరిపోయేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన (కస్టమ్-మేడ్) 3డీ ప్రింటెడ్ దవడ కీలును మార్పిడి చేశారు. క్షిష్టమైన శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో రోగి కోలుకున్నాడని, నోరు తెరవగలుగుతున్నాడని తెలిపారు.