Share News

పట్టుదలతో విజయాలు సాధించాలి

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:25 AM

పట్టుదలతో చదివి విజయం సాధించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.

పట్టుదలతో విజయాలు సాధించాలి
విద్యార్థులను అభినందిస్తున్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

నల్లగొండ రూరల్‌, జూలై 20 (ఆంరఽధజ్యోతి): పట్టుదలతో చదివి విజయం సాధించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి గణిత పోటీల్లో పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన నల్లగొండకు చెందిన విద్యార్థులను ఆదివారం జిల్లాకేంద్రంలోని నల్లగొండ ఇనిస్టిట్యూట్‌లో అభినందించారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు గణిత నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. చిన్నారుల్లో మానసిక గణిత నైపుణ్యాల మెరుగుదల కోసం అబాకస్‌ ఉపయోగపడుతుందన్నారు. విద్యారంగంలో కీలక మార్పులు వస్తున్న నేపథ్యంలో టెక్నాలజీతో చిన్పప్పటి నుంచి గణితంపై పట్టు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ బ్రాంచ్‌ హెడ్‌ భవాని, పల్లా దేవేందర్‌రెడ్డి, స్పందన, నవనీత, ఎస్‌. మనుశ్రీ, విన్మయి, రీయాన్సిక, అభిజ్ఞ, దినేష్‌ కార్తీక్‌, దుర్గ వర్మ, రిషిధర్‌ షణ్ముఖ ప్రియా, కృతిక, నిద్విత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 12:25 AM