Share News

kumaram bheem asifabad- ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం

ABN , Publish Date - Oct 10 , 2025 | 10:47 PM

ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం సాధ్యమని సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ పాల్గొని మాట్లాడారు. వేగవంతమైన జీవితంలో మానసిక ప్రశాంతత ఎంతో అవసరం అన్నారు.

kumaram bheem asifabad- ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం
మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ

ఆసిఫాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం సాధ్యమని సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ పాల్గొని మాట్లాడారు. వేగవంతమైన జీవితంలో మానసిక ప్రశాంతత ఎంతో అవసరం అన్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఒత్తిడి అధిగమించే అవకాశం ఉంటుందని చెప్పారు. దీని వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రవీణ్‌కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సాయిలక్ష్మి, రవీందర్‌, అనూష, ప్రొఫెసర్‌ కిరణ్‌, లీగల్‌ హెడ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ఆసిపాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చట్టాపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ అన్నారు. జిల్లా కేంద్రంలోని చైతన్య డిగ్రీ కళాశాలను శుక్రవారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. బాలాల సంరక్షణ చట్టాలు ఉన్నాయని వాటిపై విద్యార్థి దశ నుంచి అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు తమకు ఏమైనా ఇబ్బందులు కలిగినట్యలితే 15100 నెంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. ఎటువంటి న్యాయపరమైన సలహా అవసరమైనా తమను సంప్రదిం చవచ్చని సూచించారు. విద్యార్థి దశలో చెడును స్వీకరించకూడదని, ఎక్కడె ౖనా మంచి ఉంటే దానిని అనుసరించాలన్నారు. అనంతరం కళాశాల సిబ్బందిని ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్‌ రాజశేఖర్‌, ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌, జిల్లా మిషన్‌ కో ఆర్డినేటర్‌ శారద, జెండర్‌ స్పెషలిస్ట్‌ రాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 10:47 PM