Share News

అర్హులకే సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:25 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటు న్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం రాష్ట్ర ఆబ్కారీ, మద్య నిషేధ, పర్యాటక శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.

అర్హులకే సంక్షేమ పథకాలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటు న్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం రాష్ట్ర ఆబ్కారీ, మద్య నిషేధ, పర్యాటక శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సంద ర్భంగా కుమరం భీం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను అధికార యంత్రాంగం సమన్వయంతో అమలు చేస్తూ ప్రతి లబ్ధిదారుడికి పథకం ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గృహ జ్యోతి పథకంలో జిల్లాలో అర్హత గల లబ్ధిదారులు 75,476 మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ లబ్ధి పొందుతున్నారని చెప్పారు. అర్హత గల వారు ఎవరైనా ఉన్నట్లయితే దరఖాస్తులను పరిశీలిస్తున్నామని తెలిపారు. భూ భారతి చట్టంలో భాగంగా జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనకు బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎంఆర్‌ సమస్యల వల్ల జిల్లాలో 10 వేల టన్నుల ధాన్యాన్ని పెద్దపల్లికి పంపిం చామని తెలిపారు. జిల్లాలో కొన్ని ఇందిరమ్మ ఇళ్లు కర్‌ ఏరియాలో ఉండడంతో అటవీ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో నకిలీ, నిషేధిత విత్తనాలు, ఎరువుల విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా 4.99 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. జిల్లాలోని జోడేఘాట్‌లో జలపాతాలు ఉన్నాయని, డీపీఆర్‌ తయారు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేకానంద, ఎంపీ నగేష్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లు వెంకటేష్‌ దోత్రే, కుమార్‌ దీపక్‌, రాజర్షి, అభిలాష అభినవ్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వినోద్‌, పాయల్‌ శంకర్‌, మహేశ్వర్‌రెడ్డి, బొజ్జుపటేల్‌, అనీల్‌జాదవ్‌, రామారావుపటేల్‌, హరీష్‌రావుతో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:25 PM