Share News

పంటలను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:11 PM

భారీ వర్షాలతో చెరువుల్లా మారిన భూములను బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ గురువారం సందర్శిం చా రు. నీట మునిగిన వరి చేలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంట పొలాల్లో చేరిన వర్షపు నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపుకునేలా చూడాలని రైతులకు సూచించారు. రాబోయే రెండు రోజు ల్లోను వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

పంటలను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌
రైతులతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌

భీమిని, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో చెరువుల్లా మారిన భూములను బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ గురువారం సందర్శిం చా రు. నీట మునిగిన వరి చేలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంట పొలాల్లో చేరిన వర్షపు నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపుకునేలా చూడాలని రైతులకు సూచించారు. రాబోయే రెండు రోజు ల్లోను వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉం టూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. భారీ వర్షాల కార ణంగా దెబ్బతిన్న పంట పొలాలను, ఇళ్లను అంచనా వేసి నివేదికను స మర్పించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అలాగే దెబ్బతి న్న పొలాలు, ఇళ్లను పరిశీలించారు. కొంత మంది గ్రామస్తులు వాగుపై వంతెన వేసేందుకు చర్యలు తీసుకునేందుకు వారు ఆయనను కోరారు. వెంటనే స్పందించిన సబ్‌ కలెక్టర్‌ ఈ విషయంపై తగు చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పథకాల వివరా లు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ బికర్ణ దాస్‌, ఏఈవో జంబుల కార్తీక్‌, పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:11 PM