వెంకన్న సన్నిధిలో సుబ్బయ్య తనయుడికి ఘన సన్మానం
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:04 AM
పాలెం విద్యా సంస్థల వ్యవస్థాపకులు తోట పల్లి సుబ్రమణ్యం శర్మ (సు బ్బయ్య గారు) శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వ చ్చిన సుబ్బయ్య తనయుడు తోటపల్లి శ్రీనివాస్ శర్మను ఆ లయ ఈవో రంగారావు, ఆల య ప్రధాన అర్చకులు రా మానుజచార్యులు, గ్రామస్థు లుఆదివారం శాలువాలు, పూ ల మాలలతో ఘనంగా సన్మానించారు.
బిజినేపల్లి, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి) : పాలెం విద్యా సంస్థల వ్యవస్థాపకులు తోట పల్లి సుబ్రమణ్యం శర్మ (సు బ్బయ్య గారు) శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వ చ్చిన సుబ్బయ్య తనయుడు తోటపల్లి శ్రీనివాస్ శర్మను ఆ లయ ఈవో రంగారావు, ఆల య ప్రధాన అర్చకులు రా మానుజచార్యులు, గ్రామస్థు లుఆదివారం శాలువాలు, పూ ల మాలలతో ఘనంగా సన్మానించారు. ఆలయ నిర్మాణానికి బీజం వేసిన సుబ్బయ్య గ్రామస్థుల మదిలో ఎప్పటికీ చిరంజీవిగా నిలిచిపోతారని అన్నారు. గ్రామాన్ని, గ్రామ ప్రజలను దేవాల యాన్ని, చదువుకునేందుకు వచ్చిన పిల్లలనే తన కుటుంబంగా భావించి అనునిత్యం మదన పడేవాడని శ్రీనివాస్ శర్మ గుర్తు చేసుకున్నారు. ఈప్రాంతంలో ప్రముఖమైన క్షేత్రంగా పాలెం వెంకన్న వెలుగొందడం మాకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందన్నారు.