Minister Ponnam Prabhakar: సబ్బండ వర్గాలు కాంగ్రెస్ వైపే..
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:41 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి మరో 48 గంటల సమయం మాత్రమే ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం యూసు్‌ఫగూడ డివిజన్‌లో...
నవీన్ యాదవ్‌ను గెలిపించాలి
నాయీబ్రాహ్మణ సంఘాల మద్దతు కాంగ్రె్‌సకే
పార్టీలో చేరికల కార్యక్రమంలో మంత్రి పొన్నం
యూసు్‌ఫగూడ, వెంగళ్‌రావునగర్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి మరో 48 గంటల సమయం మాత్రమే ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం యూసు్‌ఫగూడ డివిజన్‌లో సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలోని సబ్బండ వర్గాలు కాంగ్రె్‌సకే అనుకూలంగా ఉన్నాయన్నారు. డివిజన్‌లో బూత్‌ల వారిగా ఏర్పాటు చేసిన కార్యాలయాలకు శుక్రవారం బైక్ మీద తిరుగుతూ నేతలను సమన్వయపరుస్తూ ఓటర్లను స్థానిక నేతలతో కలిసి స్వయంగా కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వెంగళ్‌రావు నగర్‌లో స్థానిక నాయకులు సంజయ్ గౌడ్, ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కాంగ్రె్‌సలో చేరారు. వారికి కండువా కప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు పేదప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. మరోవైపు.. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నాయీబ్రాహ్మణ సంఘాలతో మంత్రి పొన్నం సమావేశమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి నాయీబ్రాహ్మణ సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని ఈ సందర్భంగా చెప్పారు. కాగా గాంధీభవన్‌లో మంత్రులు పొన్నం, జూపల్లి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎ్‌సతో బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ వాళ్లు ఇప్పటికీ అధికారంలో ఉన్నామనే భావనతో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.