Share News

కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:28 PM

ప్రతీ విద్యార్థి కష్ట పడి ఏకాగ్రతతో చదివితే మంచి భ విష్యత్‌ ఉంటుందని జిల్లా విద్యా శాఖ అధికారి రమేష్‌కుమార్‌ అన్నా రు.

కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు
మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌కుమార్‌

- జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ కుమార్‌

తిమ్మాజిపేట, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ విద్యార్థి కష్ట పడి ఏకాగ్రతతో చదివితే మంచి భ విష్యత్‌ ఉంటుందని జిల్లా విద్యా శాఖ అధికారి రమేష్‌కుమార్‌ అన్నా రు. తిమ్మాజిపేట మండల పరిధి లోని గొరిట జడ్పీహెచ్‌ఎస్‌లో గత కొన్నాళ్లుగా నీటి సమస్యతో విద్యార్థు లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న ప్ర ముఖ రాజకీయ నాయకుడు ముసలి శ్యాంప్ర సాద్‌రెడ్డి తన సొంత డబ్బులతో పైపు లైన్‌ ఏర్పాటు చేశారు. పదిలో మంచి ఫలితాలు సా ధించి మండల టాపర్లుగా నిలిచిన నలుగు రు విద్యార్థులను శాలువాలు కప్పి ఘనంగా సన్మా నించి షీల్డ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈవో మాట్లా డుతూ విద్యార్థులకు త్వరలో కంప్యూటర్‌ సిలబ స్‌ ప్రారంభిస్తామని, అదేవిధంగా ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ పాఠ శాలల బలోపేతానికి అందరూ సహకరించా లన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన శ్యాం ప్రసాద్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. పాఠ శాలలో మరుగుదొడ సమస్యపై కలెక్టర్‌తో మా ట్లాడి మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. సమావేశంలో ఎంఈవో సత్యనారాయణశెట్టి, ఏఎంవో వెంకటయ్య, హెచ్‌ఎం గోవిందప్ప, విద్యా కమిటీ చైర్‌పర్సన్‌ వసీమాబేగం, పూర్వపు విద్యార్థులు జానకిరాంరెడ్డి, రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:29 PM