kumaram bheem asifabad- విద్యార్థులు వ్యసనాల బారిన పడొద్దు
ABN , Publish Date - Oct 31 , 2025 | 10:31 PM
విద్యార్థులు వ్యసనాల బారిన పడొద్దని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ‘డ్రగ్స్ నివారణ పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఏ విధంగా దూరం ఉండాలి’ అన్న అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో విజేతలకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేశారు
ఆసిఫాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు వ్యసనాల బారిన పడొద్దని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ‘డ్రగ్స్ నివారణ పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఏ విధంగా దూరం ఉండాలి’ అన్న అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో విజేతలకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాల నుంచి పూర్తిగా దూరంగా ఉండి తమ లక్ష్యాల సాధనలో కృషి చేయాలని సూచించారు. డ్రగ్స్ వ్యసనాన్ని నిరోధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని అవగాహన ద్వారా మాత్రమే సమాజం మత్తు పదార్థాల ముప్పు నుంచి రక్షించబగలమని పేర్కొన్నారు. అనంతరం విజేతలుకు నిలిచిన మొదటి స్థానం పి.కీర్తన(సిర్పూర్-యూ), రెండవ స్థానం డొంగ్రి త్రిషిక, మూడో స్థానం ఎస్.స్పూర్తి(రెబ్బెన)లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్‌పెక్టర్ శ్రీధర్, సీఐ రాణా ప్రతాప్, ఆర్‌ఐ అంజన్న, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్,(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సన్మానించారు. ఏఎస్సై మీల్ అహ్మద్, హెడ కానిస్టేబుల్ రథునాథ్ సర్కార్‌లు పదవీ విరమణ పొందగా వారిని సన్మానించి మాట్లాడారు. డ్యూటీ సమయంలో క్రమ శిక్షణతో విధులు నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకు వచ్చిన వీరి సేవ లను కొనియాడారు. అలాగే కో ఆపరేటీవ్ సోసైటీ ద్వారా జమ చేసుకున్న మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. జమీల్ అహమద్‌కు రూ.59,443, రఘునాథ్ సర్కా ర్‌కు రూ.2,44,269 చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ పెద్దన్న, సీఐ రాణా ప్రతాప్, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు విజయశంకర్‌రెడ్డి, కో ఆపరేటీవ్ సోసైటీ ఇన్‌చార్జి జాఫరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.