kumaram bheem asifabad- విద్యార్థులు లక్ష్యంతో సాగాలి
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:09 PM
విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా సంక్షేమాధికారి, డీసీపీవో మహేష్ అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ మండలంలోని అంకుశాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 20 (ఆంధ్రజోతి): విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా సంక్షేమాధికారి, డీసీపీవో మహేష్ అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ మండలంలోని అంకుశాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి, డీసీపీవో మహేష్‌తో కలిసి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకొని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్‌లో ఉన్నత స్థానాలను సాధించాలన్నారు. బాలల హక్కులకు భంగం కలిగితే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది బాలప్రవీణ్‌కుమార్, చంద్రశేఖర్, జమున, రవళి, వెంకటేశ్వర్లు, రాణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని ఎంఈవో హను మంతు అన్నారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. ముత్తంపేట పాఠశాలలో ఎంఈవో హనుమంతు హాజరై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు పెట్టకోవాలని చెప్పారు. మంచి జీవన శైలి అలవర్చుకోవా లని సూచించారు. క్రమశిక్షణతో చదివి లక్ష్యం చేరుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.