kumaram bheem asifabad- విద్యార్థులు సైన్స్‌పై పట్టు సాధించాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 10:51 PM
విద్యార్థులు సైన్స్‌పై పట్టు సాధించాలని జిల్లా సైన్స్ అధికారి మధుకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సైన్స్ డ్రామా పోటీలు అలంరించాయి. మానవ జాతి ప్రయోజనం కోసం శాస్త్ర సాంకేతిక అనే అంశంపై వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను మెప్పించారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సైన్స్‌పై పట్టు సాధించాలని జిల్లా సైన్స్ అధికారి మధుకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సైన్స్ డ్రామా పోటీలు అలంరించాయి. మానవ జాతి ప్రయోజనం కోసం శాస్త్ర సాంకేతిక అనే అంశంపై వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను మెప్పించారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రదర్శన అత్యుత్తమ ప్రదర్శన చేసి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఆసిఫాబాద్ తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం నిలిచారు. వీరికి ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా సైన్స్ అధికారి మధుకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తమ నటనా కౌశలంతో శాస్త్రీయ అంశాలు, సామాజిక స్పృహ కలిగి నాటక ప్రదర్శనలు చేయడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు ఈ దశలో విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. విజేతలుగా నిలిచిన జన్కాపూర్ పాఠశాల విద్యార్థులను వారి గైడ్ టీచర్ రాజేష్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ మహేశ్వర్, కార్యక్రమ సమన్వయకర్త ధర్మపురి వెంకటే శ్వర్లు, న్యాయనిర్ణేతలు రమేశ్, శ్రీలక్ష్మి, గైడ్ టీచర్ రాజేష్ పాల్గొన్నారు.