Share News

kumaram bheem asifabad- విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:03 PM

ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని మార్లవాయి బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులు, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, మాజీ మంత్రి ఐకేరెడ్డి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జీ ఆత్రం సుగుణక్కతో కలిసి అల్పాహారం చేశారు.

kumaram bheem asifabad- విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి
విద్యార్థుల చేత పాఠాలు చదివిపిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

జైనూర్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని మార్లవాయి బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులు, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, మాజీ మంత్రి ఐకేరెడ్డి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జీ ఆత్రం సుగుణక్కతో కలిసి అల్పాహారం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావ్‌ విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. వాటిని సరియైున రితీలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు హైమన్‌ డార్ఫ్‌ దంపతుల సమాధుల వద్ద మంత్రి నివాళులు అర్పించారు. ఆయన వెంట మార్కెట్‌ కమిచీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, మాజీ సర్పంచ్‌ కనక ప్రతిభ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మేస్రాం అంబాజీ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ ముకీద్‌, సీఐ రమెష్‌, ఎస్సై రవికుమార్‌, సార్మేడి జుగునాక దేవరావ్‌, మాజీ ఉప సర్పంచ్‌ జుగునాక సావిత్రి బాయి తదితరులు పాల్గొన్నారు.

అధికారులపై ఆగ్రహం

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని మార్లవాయి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు పాఠాలు తప్పుడా చదువడంతో విద్యాశాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం మంత్రి విద్యార్థులకు గణిత శాస్త్రంలో ప్రశలు అడిగారు. పాఠాలను చదివిపించారు. కానీ విద్యార్థులు పాఠాలు చదడానికి తడబడ్డారు. కొందరు తప్పులు చదువుతుండడంతో మంత్రి అధికారులపై సీరియస్‌ అయ్యారు. విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం కోట్ల రుపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. ఇక్కడేమో విద్యార్థులు సరిగ్గా పాఠాలు చదవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంతరం గ్రామస్థులతో మంత్రి సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్లవాయిలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని మామీ ఇచ్చా రు. మంత్రి జూపల్లి కృష్ణారావ్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పులాజీబాబా జన్మదిన మహోత్సవం కర పత్రాలను విడుదల చేశారు.

మంత్రికి వినతులు..

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మండల నాయకులతో కలిసి బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. ఆసిఫాబాద్‌ నుంచి జైనూరు మీదుగా ఉట్నూరు వరకు వెళ్లే ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయని, మరమ్మతుల చేపట్టేల చర్యలు తీసుకోవాలని కోరారు. జైనూరు పీహెచ్‌సీలో వైద్య పోస్టులను భర్తీ చేసి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జామ్ని నుంచి పంగిడి, ధబోలి, పాట్నాపూర్‌, చోరెప్పల్లి, జాములధారా రోడ్డుకు మరమ్మతు కోసం నిధులు మంజురు చేయాలని వారు కోరారు.

కెరమెరి,(ఆంధ్రజ్యోతి): కెరమెరి మండల కేంద్రంలో బుధవరం జిల్లా ఇన్‌చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు బస్టాండ్‌ ప్రాంతంలోని గాంధీ, జ్యోతిబాఫూలే, సావిత్రిబాయిఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సాకడ ఎక్స్‌ రోడ్డు వద్ద గిరిజనుల ఆరాధ్య దైవం కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ దండె విఠల్‌, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ మునీర్‌ అహ్మద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 11:03 PM