Share News

kumaram bheem asifabad- విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Nov 27 , 2025 | 10:26 PM

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఇటీవల నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో బంగారు పతకం, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం, బెంగుళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ఎంపికైన నలుగురు విద్యార్థినులు, కోచ్‌లను, వ్యాయమ ఉపాధ్యాయులు గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవనంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

kumaram bheem asifabad- విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులను అభినందిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఇటీవల నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో బంగారు పతకం, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం, బెంగుళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ఎంపికైన నలుగురు విద్యార్థినులు, కోచ్‌లను, వ్యాయమ ఉపాధ్యాయులు గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవనంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోఈల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించడం అభినం దనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి జిల్లా పేరును నిలబెట్టాలని తెలిపారు. క్రీడలలో అత్యున్నత ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన విద్యార్థులకు తర్ఫీదు అందించిన కోచ్‌లు, వ్యాయమ ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి శేషు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఉద్దవ్‌, కోచ్‌లు తిరుమల, విద్యాసాగర్‌, అరవింద్‌, పీడీలు మీనారెడ్డి, లక్ష్మణ్‌, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిశీలించి.. సూచనలు చేసి..

వాంకిడి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వాంకిడి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే గురువారం పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.. ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఇబ్బంది కలుగ కుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్‌ దరఖాస్తులు, ఓటరు జాబితాలను అందుబాటులో ఉంచుకోవాలని రిటర్నిగ్‌ అధికారి, అసిస్టేంట్‌ రిటర్నింగ్‌ అధికారులను సూచించారు. నామినేషన్ల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని అధికారులను అదేశించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో జోత్స్న, ఇన్‌చార్జి తహసీల్దార్‌ రిజాయ్‌అలీ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 10:26 PM