Share News

విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలి

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:06 PM

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని క లెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండ లంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సందర్శించారు. తరగతి గదులు, పరిసరాలను, మధ్యాహ్న భోజనాన్ని ప రిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వి ద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిం చాలని సూచించారు. చదువుతో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలి
కేజీబీవీలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మందమర్రిరూరల్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని క లెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండ లంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సందర్శించారు. తరగతి గదులు, పరిసరాలను, మధ్యాహ్న భోజనాన్ని ప రిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వి ద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిం చాలని సూచించారు. చదువుతో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలన్నారు. అంతకుముందు తహసీల్దా ర్‌ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులు, రిజిష్టర్‌ల ను తనిఖీ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చే ప్ర జలకు పనులను నిర్ధేశిత గడవులోగా పరిష్కరించా లని, ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలన్నారు. అనంత రం వెంకటాపూర్‌ గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. మొక్కలను సంరక్షణకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, ఆర్‌ఐ గణపతి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 11:06 PM