విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 10:51 PM
మండలం కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో గురువారం ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్భుగుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలల్లోని రికార్డులను పరిశీలించారు.
ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
జన్నారం,ఆగస్టు21(ఆంద్రజ్యోతి): మండలం కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో గురువారం ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్భుగుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలల్లోని రికార్డులను పరిశీలించారు. ప్రతి ఉపాధ్యాయుడు సమయ పాలన పాటించడంతో పాటు విద్యార్థులతో కలిసి ఉండాలన్నారు. పాఠశాలలోని కిచెన్‌తో పాటు వాటర్ ప్లాంట్లను పరిశీలించారు. తరిగిన కూరగాయలతో పాటు వండిన భోజనాలను సైతం పరిశీలించారు. అనంతరం విద్యార్థులు ఉన్న క్లాస్‌రూంలోకి వెల్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువాలని సూచించారు. ఇంచార్జీ వార్డెన్ గణేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్లలో ఫ్యాన్‌లు, ఆర్‌వో ప్లాంట్‌లు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పడంతో అక్కడే ఉన్న ఐటీడీఏ పీవో సమస్యలన్ని సాయంత్రం కల్ల పరిష్కరించాలని వెంటనే డీటీడీవో జనార్ధన్‌ను ఆదేశించారు. విద్యార్థులకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా సమస్యలు లేకుండా ఉండాలని సూచనలు చేశారు. ఆమె వెంట పాఠశాల సిబ్బంది ఉన్నారు.