kumaram bheem asifabad- విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలి
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:08 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసి స్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన రుచికరమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను గురువారంసందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యత, వంట శాల, తరగతి గదులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసి స్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన రుచికరమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను గురువారంసందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యత, వంట శాల, తరగతి గదులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు. వంట మనుషులతో మాట్లాడి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు తెలుసుకున్నారు. వంట సమయంలో శుభ్రత పాటిం చాలని, తాజా కూరగాయలు, నిత్యావసర సరుకలను వినియోగించాలన్నారు. విద్యార్థులకు శుద్ధమైన తాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయుల స్థానంలో బోధించిన తీరును పరిశీలించారు. విద్యార్థులను గణితం నుంచి ప్రశ్నలు అడిగి వారి అభ్యాసాన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠాలు బోధించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.