kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:19 PM
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను బుధవారం సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భజనం అంశాలను పరిశీలించి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను బుధవారం సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భజనం అంశాలను పరిశీలించి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని చెప్పారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. వసతి గృహ పరిసరాల్లో వర్షపు నీరు నిలువ ఉండకుండా నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి రోజు వంట శాఖ, స్టోర్ రూం, తాగునీరు మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పని సరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు తమ పీరియడ్ సమయానికి స్టాఫ్ రూంలో కాలక్షేపం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలనలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.