kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:27 PM
ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని తహసీల్దార్ రామ్మోహన్‌రావు అన్నారు. మండలంలోని కుంటలమానేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం తనిఖీ చేశారు.
బెజ్జూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని తహసీల్దార్ రామ్మోహన్‌రావు అన్నారు. మండలంలోని కుంటలమానేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక విద్య అందినప్పుడే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మొక్కలతోనే మానవాళి మనుగడ
బెజ్జూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మొక్కలతోనే మానవాళి మనుగడ ఉంటుందని తహసీల్దార్ రామ్మోహన్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శనివారం వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాల న్నారు. భవిష్యత్ తరాలకు మొక్కల వల్ల కలిగే ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంఈవో సునీత, ఏపీవో రాజన్న పాల్గొన్నారు.