Share News

‘విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావం లేకుండా చూడాలి’

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:42 PM

విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావం లేకుండా చూ డాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం న స్పూర్‌లోని కలెక్టర్‌ సమావేశ మందిరంలో డీసీపీ భా స్కర్‌, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు.

‘విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావం లేకుండా చూడాలి’

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావం లేకుండా చూ డాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం న స్పూర్‌లోని కలెక్టర్‌ సమావేశ మందిరంలో డీసీపీ భా స్కర్‌, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్ర యం, వినియోగాలను నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. మా దక ద్రవ్యాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విని యోగించడం వల్ల కలిగే నష్టాలను అర్థమయ్యేలా ర్యా లీలు, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మానసిక వైద్య నిపుణులతో శిబిరాలను ఏర్పాటు చేసి విద్యార్థు లకు మాదక ద్రవ్యాల వల్ల కలిగేనష్టాలను వివరించా లన్నారు. ఈ నెల 21న యోగాడేలో భాగంగా సే నో టు డ్రగ్స్‌ సే ఎస్‌ టూ యోగా నినాదంతో మాదక ద్ర వ్యాల నివారణపై అవగాహన శిబిరాలను నిర్వహిం చాలన్నారు. 22న హైరిస్క్‌ జోన్‌లు, పని ప్రదేశాల్లో అ వగాహన కల్పించాలని, 23న మొక్కలు నాటడం, 24, 25 తేదీల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పో టీలు నిర్వహించి బహుమతులు అందే యాలన్నారు. అనంతరం కార్యక్రమం సంబంధిత పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరి కృష్ణ, జిల్లా అబ్కారీ మద్యనిషేధ అధి కారి నంద గోపాల్‌, ఏసీపీలు వెం కటేశ్వర్లు, రవికుమార్‌, మానిసక వైద్య నిపుణులు సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:42 PM