Share News

kumaram bheem asifabad- విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:27 PM

విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సలుగుపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్‌ అన్నారు. గురువారం యాంటీ డ్రగ్స్‌ డే సందర్భంగా సలుగుపల్లి గ్రామంలోని పాఠశాల విద్యార్థులచేత ర్యాలీ నిర్వహించారు.

kumaram bheem asifabad- విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి
సలుగుపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

బెజ్జూరు, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సలుగుపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్‌ అన్నారు. గురువారం యాంటీ డ్రగ్స్‌ డే సందర్భంగా సలుగుపల్లి గ్రామంలోని పాఠశాల విద్యార్థులచేత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మత్తు పదార్థాలకు బానిస కాకుండా దూరంగా ఉండాలన్నారు. ప్రజలు యువత మత్తు పదార్థాల నిర్మూలన కోసం సంఘటితమై కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాల వాడకంతో జీవితాలు నాశనమై భవిష్యత్‌ లేకుండా పోతుందన్నారు. ముఖ్యంగా చదువుతున్న విద్యార్థు లు వాటి జోలికి పోవద్దన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ఎంచుకుంటూ ఉన్నత చదువు లు చదివి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతి, రమేష్‌, నాయకులు విశ్వేశ్వర్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 06కెజి26:

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలను యువత దూరంగా ఉండాలని ఎస్సై కొమురయ్య అన్నారు. ఇంటర్నేషనల్‌ యాంటీ డ్రగ్స్‌ డే సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్‌ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వాడకంతో జీవితాలు నాశనమై భవిష్యత్‌ లేకుండా పోతుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యతో పాటు మంచి ఆరోగ్యం కోసం వ్యాయమం చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయనిర్మల, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలను నిషేధించాలని, గంజాయి, డ్రగ్స్‌, గుడుంబా వంటి మత్తు పదార్థాలు వినియోగించకూడదని గురువారం చింతలమానేపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో జయరాజు, ఎస్సై, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:27 PM