DGP Jitender: చమురు, గ్యాస్ రంగ భద్రతకు పటిష్ఠ చర్యలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:23 AM
రాష్ట్రంలో చమురు, గ్యాస్ రంగ భద్రతకు మరిన్ని పటిష్ఠ చర్యలు చేపట్టనున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు..
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చమురు, గ్యాస్ రంగ భద్రతకు మరిన్ని పటిష్ఠ చర్యలు చేపట్టనున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. డీజీపీ అధ్యక్షతన పోలీస్ ప్రధాన కార్యాలయంలో తీర ప్రాంత భద్ర తా సమన్వయ కమిటీ(ఓఎ్‌ససీసీ) సమావేశం బుధవారం జరిగింది. గెయిల్ ఇండియా భద్రతా సలహాదారు సౌరభ టోలుంబియా, అదనపు డీజీపీ మహేష్ భగవత్, సీఐడీ చీఫ్ చారు సిన్హా ఈ సమావేశానికి హాజరయ్యారు. చమురు, గ్యాస్ రంగానికి భద్రతాపరంగా ఎదురవుతున్న సమస్యలు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. కాగా, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఓఎ్‌ససీసీ కమిటీకి జితేందర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.