kumaram bheem asifabad- సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట నిఘా
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:34 PM
గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ నితికా పంత్ పోలీసులను ఆదేశించారు. స్థానిక విద్యా వనరుల కేంద్రంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఎస్పీ బుధవారం సందర్శించారు.
జైనూర్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ నితికా పంత్ పోలీసులను ఆదేశించారు. స్థానిక విద్యా వనరుల కేంద్రంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఎస్పీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులలో పాల్గోన్న పోలీసు అధికారులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేల కట్టు దిట్టంగా పోలీసు బందో బస్ ఏర్పాటు చేయాల ని సూచించారు. కార్యక్రమంలో సీఐ రమేశ్, ఎస్సై రవికుమార్ పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి):మండల కేంద్రంలోని జిలా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ నితికా పంత్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తుతోపాటు భద్రతా చర్యలను ఎస్పీ నితికా పంత్ పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న ఆర్‌ఐ విద్యాసాగర్, ఎస్సై రామకృష్ణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి ఎన్నికల సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణపై సూచనలు చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద అనుచిత కార్యకలాపాలు, గుంపులుగా తిరగడం ప్రలోభాలకు లేదా బెందిరింపులకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల చుట్టపక్కల నలుగురికి మించి వ్యక్తులు ఉండకుండా సిబ్బంది పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు.