రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:42 PM
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్,బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌లతో కలిసి పోలీసు, రెవెన్యూ, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్,బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌లతో కలిసి పోలీసు, రెవెన్యూ, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి 7 వరకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను సమర్ధవంతం గా నిర్వహించాలన్నారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొలగించాలని, ట్రాఫిక్‌పోలీసులు రోడ్లపై అనధికర వాహనాల నిలుపుదల, నిబంధనల ఉల్లం ఘన పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారుల సంస్థ అధి కారులు హైద్రాబాద్-కరీంనగర్- చంద్రపూర్ రహదారిపై రం బుల్ స్ర్టిప్స్, లైటింగ్, జాగ్రత్త సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, బాసర -లక్షెట్టిపేట రాష్ట్రీయ రహదారి 24పై ప్ర మాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నందున భద్రత చ ర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమీషనర్‌లు సెల్లార్ స్థలాలను కేవలం పార్కింగ్ కోసమే ఉపయోగించేలా చర్య లు తీసుకోవాలని, నాళాలపై అనధికార నిర్మాణాలను వెంట నే తొలగించాలన్నారు. శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ర ద్దీ తగ్గించేందుకు బస్టాండ్ వెనక భాగానికి మార్చాలని, బస్టాండ్‌కు సంబంధించిన అటవీ అనుమతి ప్రక్రియ వేగ వంతం చేయాలని తెలిపారు. మందమర్రి వంతెన వద్ద కూ రగాయల వ్యాపారులు ఆక్రమించిన ప్రదేశాలను క్లియర్ చే యాలని, హైవేలకు వెళ్లే రహదారులపై స్పీడ్‌బ్రేకర్లు ఏర్పా టు చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో లైసెన్స్‌లు రద్దు అయిన వివరాలు, పరిమితికి మించి లోడింగ్ చేసి తనిఖీల్లో పట్టుబడిన వాహనాల వివరాలను ప్రతి వారం ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.