మెరుగైన విద్య అందించేందుకు కృషి
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:45 PM
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు లకు మెగురైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు
- మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు లకు మెగురైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొల్లాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్‌టీ యూటీఎస్)-2026 సంబంధించి డైరీ, క్యాలెం డ ర్‌తో పాటు జీవోల ప్రతులను మంత్రి జూప ల్లి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా వ్యవస్థను గాడిలో పెడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సం ఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రావు, ప్రధాన కార్య దర్శి మురళి, రాష్ట్ర నాయకులు సతీష్, రమేష్, ప్రభాకర్, జిల్లా నాయకులు ఈశ్వర్, కరుణాకర్ రెడ్డి, శేఖర్, మద్దిలేటి, మల్లయ్య, కురుమయ్య, జాకీర్ హుస్సేన్, హనుమంత్, బి.కురుమయ్య, కొల్లాపూర్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వర ప్రసాద్, చంద్రుడు, చెన్నయ్య, మధుసూద న్‌రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.