Share News

మహనీయుల ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:28 PM

మహనీయుల ఆశయ సాధన కు కృషి చేద్దామని పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు.

మహనీయుల ఆశయ సాధనకు కృషి
జటప్రోలులో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న మంత్రి జూపల్లి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌ వెన్నెల

పెంట్లవెల్లి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యో తి) : మహనీయుల ఆశయ సాధన కు కృషి చేద్దామని పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు. మండల పరిధిలోని జటప్రో లు గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆ యన ప్రారంభించారు. గన్నీ బ్యాగుల సైజు తక్కువగా ఉండడంతో ధాన్యం నింపేందుకు ఇబ్బందిగా ఉందని రైతులు చెప్పడంతో కలెక్టర్‌తో మాట్లాడి స మస్యను పరిష్కరించాలని అధికారు లకు సూచించారు. అనంతరం నిర్వహించిన జై బాపూ, జైభీం, జై సంవిధాన్‌ ర్యాలీలో పాల్గొ న్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్స న్‌ గుమ్మడి వెన్నెలతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహా నికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గాంధీ, అంబేడ్కర్‌ ఆశయాలు పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. జటప్రోలులో రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణానికి వారం రోజుల్లో భూమిపూజ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గోవిందుగౌడ్‌, రామన్‌గౌడ్‌, భీంరెడ్డి, నాగిరెడ్డి, నల్లపోతుల గోపాల్‌, ఆకునమోని రాముయాదవ్‌, కృష ్ణప్రసాద్‌, కోట్ల సురేందర్‌, గురక ఆంజనేయులు, బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 11:28 PM